మరో వింత: భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన గ్రహశకలం

August 22, 2020 at 6:02 pm

ఇటీవల కాలంలో పరిమాణంలో చిన్నదైన ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంగా దూసుకెళ్లిందని నాసా గుర్తించింది. ఇప్పటివరకు భూమికి చేరువగా వచ్చిన గ్రహశకలాల్లో ఇదే అత్యంత సమీపంగా వచ్చినట్లు స్పష్టం చేసింది. దక్షిణ హిందూ మహా సముద్రం నుంచి 2,950 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లినట్లు తెలిపారు. ఈ గ్రహశకలం సుమారు సెకనుకు 8 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఎస్​యూవీ వాహనం పరిణామంలో ఉన్న ఈ గ్రహశకలానికి ‘2020-క్యూజీ’ అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. గ్రహశకలాల ప్రమాణాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఒకవేళ దీని ప్రయాణ మార్గంపై ఏదైనా ప్రభావం పడి భూమివైపు దూసుకొస్తే ఇక్కడి వాతావరణంలో మండిపోతుందని పేర్కొన్నారు.

సౌర కుటుంబంలో ఇలాంటి చిన్న గ్రహశకలాలు కోట్ల సంఖ్యలో ఉంటాయని అంచనా. అయితే భూమికి అత్యంత సమీపానికి వచ్చే వరకు గుర్తించటం చాలా కష్టం. ఇప్పటివరకు భూమికి సమీపంలోకి వచ్చిన గ్రహశకలాల్లో ఎక్కువ శాతం చంద్రుని కన్నా దూరం నుంచి వెళ్లాయి.

మరో వింత: భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన గ్రహశకలం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts