అమరావతికి అసలు షాక్ అప్పుడేనా?

August 8, 2020 at 9:56 am

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ మూడు రాజధానులకు అడ్డుపడుతున్నా సరే, దాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. త్వరలోనే కర్నూలు న్యాయరాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, విశాఖ పరిపాలనా రాజధానిగా కానున్నాయి.

అయితే పేరుకు మూడు రాజధానులైనా అసలు రాజధాని మాత్రం విశాఖపట్నం అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్‌, సచివాలయం, మంత్రులు, శాఖల ప్రధాన కార్యాలయాలు ఉండేది విశాఖలోనే కాబట్టి, అదే అసలు రాజధాని అని, పేరుకు మాత్రమే అమరావతి, కర్నూలులు రాజధానులుగా ఉండనున్నాయని అంటున్నారు.

శాసన రాజధానిగా ఉన్న అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు సంవత్సరంలో జరిగేది రెండు నెలల లోపే అని, తర్వాత అమరావతికి పెద్ద ప్రాధాన్యత ఉండదని, అలాగే కర్నూలులో హైకోర్టు వచ్చినా, విజయవాడ, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే కర్నూలుకు ప్రాధాన్యత తగ్గుతుందని మాట్లాడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అమరావతికి జగన్ పెద్ద షాక్ ఇవ్వడానికే రెడీ అవుతున్నారని తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం పరిపాలన విశాఖ నుంచే జరుగుతుంది కాబట్టి, రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఇక్కడే జరగొచ్చని చెబుతున్నారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం పదే పదే అమరావతికి రావాలంటే ఆర్ధిక వ్యయం పెరుగుతుందని చెప్పి, విశాఖలోనే అసెంబ్లీని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అంటే పేరుకు మూడు రాజధానులు ఉన్నా సరే, అసలు రాజధాని మాత్రం విశాఖపట్నం ఉంటుందని తమ్ముళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక హైకోర్టులో కూడా అవాంతరాలు తొలిగిపోతే అతి త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ జరగనుంది. మొత్తానికైతే భవిష్యత్‌లో ఏపీకి రాజధానిగా విశాఖ ఉండనుందని తమ్ముళ్ళు స్ట్రాంగ్‌గా చెప్పేస్తున్నారు.

అమరావతికి అసలు షాక్ అప్పుడేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts