ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ.. వాటిపైనే ఫోక‌స్‌!!

August 14, 2020 at 2:57 pm

ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్య‌మంత్రి జగన్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విప‌రీతంగా విస్త‌రిస్తున్న‌ నేప‌థ్యంలో ఈ కేబినెట్ భేటీ కీల‌కం కానుంది.

ఈ స‌మావేశంలో కరోనా నివారణ, చికిత్స, కొత్త జిల్లాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలు, ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇటీవల తీసుకువచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు మొదలైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపైనా ఈ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు చ‌ర్చించ‌నున్నారు.

కాగా ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా పెర‌గ‌డంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స‌మయంలో ప్ర‌భుత్వం ఈ కేబినెట్ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతుందో కీల‌కంగా మార‌నుంది.

ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ.. వాటిపైనే ఫోక‌స్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts