కరోనా రోగుల‌కు కాలింగ్ బెల్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!!

August 7, 2020 at 2:33 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచేశాలను హ‌డ‌లెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క‌.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక ఏపీలోనూ క‌రోనా రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొద‌ట అదుపులో ఉన్న క‌రోనా.. అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం త‌ర్వాత‌.. మ‌రింత వేగంగా వ్యాప్తిచెందుతోంది. అయితే ఇలాంటి తరుణంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితి పర్యవేక్షించాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్‌లకు ఆదేశించారు.

ఇక ఈ బెల్స్‌ను రిసెప్షన్‌కు అనుసంధానం చేస్తారు. రోగి బజర్ నొక్కిన దగ్గర నుంచి డాక్టర్ లేదా నర్సు వచ్చేవరకూ బెల్ మోగుతూనే ఉంటుంది. కాగా, కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న నేప‌థ్యంలోనే సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసు‌లు సంఖ్య రెండు ల‌క్ష‌లకు చేర‌వ అవుతుండ‌గా.. 1753 మంది ఈ మ‌హ‌మ్మారి కాటుకు బ‌లైపోయారు.

కరోనా రోగుల‌కు కాలింగ్ బెల్‌.. జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts