గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందంట..!

August 13, 2020 at 6:38 pm

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే ఈ వైరస్ సోకిన దగ్గర నుండి వినిపిస్తున్న ప్రశ్న గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా. అయితే చాలా మంది అలాంటిదేమీ ఉండదని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణులు పరిశోధనలు చేశారు.

అయితే వారి పరిశోధనలో గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వారు దీనికి సంబంధించి మెడ్‌రెక్సివ్‌లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. గాలి ద్వారా కరోనా 4.8 మీటర్ల దూరం వరకు వ్యాప్తిస్తుందని వారు అంటున్నారు.అంతేకాదు చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న భౌతికదూరం సరిపోదని ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని వైరాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందంట..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts