వైసీపీలోకి గంటా… బీజేపీలోకి అయ్య‌న్న‌.. బాబోరి గ‌తేంగాను..!

August 7, 2020 at 11:07 am

ఏపీలో రాజ‌కీయం ఆస‌క్తిగా మారుతోంది. ఓ వైపు క‌రోనా జోరుగా ఉన్నా కూడా అధికార పార్టీ ఎక్క‌డా దూకుడు త‌గ్గించ‌డం లేదు. జ‌గ‌న్ విప‌క్ష టీడీపీకి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెట్టేస్తూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. మూడు రాజధానుల విష‌యం ఇప్ప‌ట్లో తెగేలా లేదు అనుకున్నా గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేయ‌డంతో ఏపీకి మూడు రాజ‌ధానులు అధికారికంగా అమ‌ల్లోకి వచ్చేశాయి. రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు రాజీనామా డ్రామాలు ఆడాల‌నుకున్నా దానికి కూడా సొంత పార్టీ నేత‌లు ఒప్పుకోలేని పరిస్థితి. ఈ టెన్ష‌న్‌లో ఉన్న చంద్ర‌బాబు వ‌రుస షాకులు త‌గిలేందుకు అంతా రెడీగా ఉంద‌ట‌.

ఇప్పటికే పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పార్టీ మారిపోతున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌న మందీ మార్బ‌లంతో త‌న అనుచ‌ర‌గ‌ణ‌మైన విశాఖ‌కు చెందిన ఒక‌రు లేదా ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు మ‌రికొంద‌రు మాజీ ఎమ్మెల్యేల‌తో పార్టీ మారిపోతున్నార‌ని.. ఇందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి గంటా మూడు నెల‌ల క్రిత‌మే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. అప్ప‌టి నుంచే ఆయ‌న‌పై సందేహాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు పార్టీ మారుతోన్న గంటాకు జ‌గ‌న్ నుంచి విశాఖ మేయ‌ర్ పీఠం ఆయ‌న వ‌ర్గానికే ద‌క్కేలా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని అంటున్నారు.

గంటా పార్టీని వీడ‌డం చంద్ర‌బాబుకు ఓ షాక్ అయితే ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింద‌ని అంటున్నారు. విశాఖ జిల్లాలో గంటాకు చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న మ‌రో మాజీ మంత్రి అయ్య‌న్నపాత్రుడు క‌న్ను ఇప్పుడు క‌మ‌లంపై ప‌డింద‌ని అంటున్నారు. అయ్య‌న్న వైఖ‌రిలో ఈ మార్పు వెన‌క టీడీపీ ప‌నైపోయింద‌న్న నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చేశారా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉండ‌డంతో పాటు మోస్ట్ సీనియ‌ర్‌గా ఉన్న అయ్య‌న్న తాజాగా రామ‌మందిరంకు భూమిపూజ త‌ర్వాత మోడీని, బీజేపీని మెచ్చుకుంటూ వీడియో రిలీజ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీడీపీ ఇప్పుడు చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత క‌ష్ట‌కాలంలో ఉంది. ఇలాంటి టైంలో ఈ ఇద్ద‌రు మాజీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు హ్యాండ్ ఇచ్చేలా ఉండ‌డంతో టీడీపీ కేడ‌ర్‌లో ఎక్క‌డా లేని నైరాశ్యం అలుముకుంది. వీరిద్ద‌రు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారం అనుభ‌వించిన వారే.. అధికారం ఎంజాయ్ చేసిన వారే ఇప్పుడు ప‌క్క చూపులు చూస్తున్నారంటే పార్టీలో ఏళ్ల‌కు ఏళ్లుగా ఉంటూ ఎలాంటి ప‌ద‌వులు లేని వారు ఇప్పుడు పార్టీలో ఎందుకు ఉంటార‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ముందుగా గంటా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇపుడు ఆయన వైసీపీలోకి వెళ్లాలనుకోవడంతో అయ్యన్న బీజేపీ అంటున్నారని విశ్లేషిస్తున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే అటు రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఇటు జంపింగ్‌ల ఎఫెక్ట్‌తో విశాఖ‌లో టీడీపీ చాప చుట్టేసిన‌ట్టే ఉంది.

వైసీపీలోకి గంటా… బీజేపీలోకి అయ్య‌న్న‌.. బాబోరి గ‌తేంగాను..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts