యుద్ధభూమిని తలపిస్తోన్న బెంగళూరు పులకేసినగర్

August 12, 2020 at 5:37 pm

ఫేస్‌బుక్‌ పోస్ట్​ కారణంగా బెంగళూరులో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారాయి. పులకేసినగర్​ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం ఏకంగా యుద్ధభూమిని తలిపిస్తోంది. వీధి దీపాలతో పాటు రహదారిపై ఉన్న దుకాణాల సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. డీసీపీ వ్యాన్​, పోలీసుల వాహనం​ సహా మొత్తం 8 వాహనాలకు నిప్పంటించారు. మరికొన్ని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ హింసాత్మక దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కాగా.. ఇప్పుడివి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి బంధువు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం బెంగళూరులో అల్లర్లకు దారితీసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన అల్లర్లు.. బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.

ఈ ఘటనలో సుమారు 3వేల మందికిపైగా నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. అల్లర్లను అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా.. 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 145 మందిని అరెస్ట్​ చేశారు.

యుద్ధభూమిని తలపిస్తోన్న బెంగళూరు పులకేసినగర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts