బ్రేకింగ్: అది జగన్ పుణ్యమే, మంత్రి కీలక వ్యాఖ్యలు…!

August 7, 2020 at 12:58 pm

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏపీ సర్కార్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆర్ధికంగా కష్టాలు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నేతమ్మలు, నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ప్రభుత్వం అండదండ అందిస్తుందని అన్నారు.

గాంధీ జయంతి రోజు ఈ–మార్కెటిగ్ ను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండ‌వ ఏడాది సాయమందించామని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని కనీసం ఆ రోజైనా చేనేత దుస్తులనే ధరించాలన్నారు ఆయన. ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోందని చెప్పారు. ‘వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ ద్వారా దాదాపుగా 81,024 వేల కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు మంత్రి. మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తామన్న సీఎం హామీని నెరవేర్చామని చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా వృత్తిని వదిలేసినవారు, కొత్తవారు ఈ రంగంలోకి రావడానికి మక్కువ చూపుతున్నారని ఆయన చెప్పారు.

బ్రేకింగ్: అది జగన్ పుణ్యమే, మంత్రి కీలక వ్యాఖ్యలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts