టీడీపీలో ప‌డిపోనున్న మ‌రో బిగ్ వికెట్‌.. బాబు చేతులెత్తేశారా..!

August 6, 2020 at 10:10 am

ఎప్ప‌టినుంచో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ జంపింగ్ వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చిందా ? ఇక‌, ఆయ‌న త్వ‌ర‌లోనే తిరిగి జ‌గ‌న్ గూటికి చేరుకుంటారా? ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నప్ప‌టికీ ఫ‌లించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు గొట్టిపాటి ర‌వి ద‌గ్గ‌ర‌కు పార్టీలో సీనియ‌ర్ అయిన మాజీ మంత్రి ఒక‌రిని పంపించార‌నే వార్త‌.. ప్ర‌కాశం రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతంరాజ‌ధాని వేడి రాజుకున్న స‌మ‌యంలో ప్ర‌కాశంలో టీడీపీ నేత‌లు మౌనంగా ఉన్నారు. ఎవ‌రూ కూడా ముందుకు రావ‌డం లేదు.

అమ‌రావ‌తిని కాదంటే ఏమ‌వుతుందో.. ఔనంటే ఏమవుతుందో.. అనే సందిగ్దంలో ఉన్నారు. అదేస‌మ‌యంలో పార్టీ ప‌రిస్థితి కూడా నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. కేవ‌లం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు మాత్ర‌మే చంద్ర‌బాబు ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప‌.. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, ఇవ‌న్నీ ఇలా ఉంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు ముందుకు సాగడం లేదు. వ్య‌క్తిగ‌తంగా కూడా త‌న వ్యాపారాలు కూడా ముందుకు సాగ‌ని ప‌రిస్థితి నెలకొంది.

ఈ నేప‌థ్యంలోనే రెండు రోజుల కింద‌ట త‌న అనుచ‌రుల‌తో గొట్టి పాటి భేటీ అయ్యారు. దీంతో వారంతా కూడా పార్టీ మారాల‌నే సూచించార‌ని తెలుస్తోంది.
ఇక‌, వైఎస్సార్ సీపీ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి గొట్టిపాటితో నిరంత‌రం ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. అయితే,ఆయ‌న త‌న క‌ర‌ణం వ‌ర్గాన్ని ప‌క్క‌న పెడితే.. త‌న‌కు అభ్యంత‌రం లేద‌నే వాద‌న కూడా వినిపిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికీ.. టీడీపీకి ఎప్ప‌టి నుంచో ఉన్న ఇద్దరు కీల‌క నాయ‌కుడు శిద్దా రాఘ‌వ‌రావు, క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి కూడా టీడీపీని వీడి జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు.

అలాంటిది వైఎస్సార్ సీపీ నుంచే వ‌చ్చిన తాను ఉండ‌డం వ‌ల్ల పార్టీలో ఎలాంటి గుర్తింపూ ఉండ‌ద‌ని భావిస్తున్న గొట్టిపాటి ర‌వి.. జంపింగ్‌కే రెడీ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, దీనిపై చంద్ర‌బాబు మాత్రం ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌తో మంత‌నాల‌కు మాజీ మంత్రిని రంగంలోకి దింపారు. అయితే, ఈ రాయ‌బేరాలు ఫ‌లించే ఛాన్స్ కూడా లేదంటున్నారు.

టీడీపీలో ప‌డిపోనున్న మ‌రో బిగ్ వికెట్‌.. బాబు చేతులెత్తేశారా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts