బిగ్ బాస్ సీజన్-4 హౌస్ అదిరింది.. వైర‌ల్ అవుతున్న వీడియో!!

August 5, 2020 at 8:36 am

బుల్లితెర‌ ప్రేక్షకులను ఎంద‌గానో ఆక‌ట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు కంప్లీట్ చేసుకన్న సంగ‌తి తెలిసిందే. సరికొత్త థీమ్‌తో నడిచే షో అయినప్పటికీ… ఇక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం క‌రోనా విజృంభిస్తున్న వేళ‌ అసలు బిగ్ బాస్ షో ఉంటుందా? ఉండదా? అనే సందేహాలకు తెరదించుతూ కమింగ్ సూన్ అంటూ ప్రోమో వదిలారు. ఇక ఈ సీజన్‌కి కూడా హోస్ట్ నాగార్జునే కన్ఫార్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సీజన్-4కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన చిత్రాలు ఓ వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బ‌ట్టీ చూస్తుంటే.. బిగ్‌బాస్ హౌస్‌ను ఈ సారి చాలా క‌ల‌ర్ ఫుల్‌గా డిసైన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ నెల 30 నుంచి బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమై, దాదాపు 100 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తొంది.

ఇక కంటెస్టెంట్లుగా చాలామంది సెలబ్రిటీల పేర్లే వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ లు కరోనా,లాక్ డౌన్ కారణంగా ఆగిపోవడంతో పలువురు ప్రముఖులు ఈ సీజన్ హౌస్ లోకి వెళ్లనున్నారని, దీంతో ఈ ప్రోగ్రామ్ రక్తి కడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సీజన్ కోసం.. 30 మంది కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసి వారికి కరోనా టెస్ట్‌లు నిర్వహించి.. వీరిలో నెగిటివ్ రిపోర్ట్స్‌తో పాటు హెల్త్ ఇష్యూస్ లేని 16 మంది కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేసి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు నిర్వాహకులు.

బిగ్ బాస్ సీజన్-4 హౌస్ అదిరింది.. వైర‌ల్ అవుతున్న వీడియో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts