అఫీషియ‌ల్‌: బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా ఆ స్టార్ హీరో… అప్పుడే మొద‌లైన ట్రోలింగ్‌..!

August 1, 2020 at 12:57 pm

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ తొలి మూడు సీజ‌న్ల‌లో దుమ్ము రేపింది. తొలి సీజ‌న్ హోస్ట్‌గా ఎన్టీఆర్ దుమ్ము రేపేశాడు. ఇక రెండో సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించినా యావ‌రేజ్ అయ్యింది. ఇక మూడో సీజ‌న్లో నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే మూడో సీజ‌న్ అనుకున్నంత ఆస‌క్తిగా లేద‌న్న విమ‌ర్శలు వ‌చ్చాయి. కొంద‌రు నాగార్జున హోస్టింగ్‌ను కూడా త‌ప్పుప‌ట్టారు. మ‌రి కొంద‌రు మాత్రం నాని హోస్టింగ్ చేసిన రెండో సీజ‌న్ వీక్ అని అన్నారు. ఎవ‌రెన్ని కామెంట్లు చేసినా ఎన్టీఆర్ హోస్టింగ్‌ను మాత్రం ఎవ్వ‌రూ త‌ప్ప ప‌ట్ట‌లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఇర‌గదీశాడ‌నే చెప్పాలి.

ఇక ఈ యేడాది బిగ్ బాస్ సీజ‌న్ – 4 ఇప్ప‌టికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఈ షో లేట్ అవుతూ వ‌స్తోంది. బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎవ‌రు హోస్ట్‌గా ఉంటారు ? కంటెస్టెంట్లు ఎవ‌రు ? అన్న దానిపై ఆనేకానేక ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ బిగ్ బాస్ సీజ‌న్ – 4 హోస్ట్‌కు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

bigg-boss-telugu-season-4-

అన్న‌పూర్ణ స్టూడియోలో షూట్ చేస్తోన్న సీన్ల‌ను, కొన్ని ఫోటోల‌ను కింగ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ అక్కౌంట్లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు షో ప్రోమోకు సంబంధించింది అని చెపుతున్నారు. షో హోస్ట్‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తార‌న్న దానిపై క్లారిటీ వ‌చ్చినా కంటెస్టెంట్ల విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు. మరికొద్దిరోజుల్లో వారి లిస్ట్ కూడా బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే నాగార్జున హోస్టింగ్‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది. మూడో సీజ‌న్‌కు హోస్టింగ్ చేసిన నాగార్జున షో మొత్తం చూడ‌కుండా కొంద‌రు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆథారంగానే హోస్ట్ చేశాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ నాగార్జున హోస్ట్‌గా ఉన్నా షోకు కిక్ రాద‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

అఫీషియ‌ల్‌: బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా ఆ స్టార్ హీరో… అప్పుడే మొద‌లైన ట్రోలింగ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts