బిగ్ బ్రేకింగ్.. క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి!!

August 1, 2020 at 4:05 pm

క‌రోనా వైర‌స్‌.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. సామాన్యులనే కాదు.. ప్రజా ప్రతినిధులకు, సెల‌బ్రెటీల‌కు కూడా క‌రోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క‌రోనా బారినపడి కోలుకోగా.. కొంద‌రు మృతి చెందారు కూడా. ఇక తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు(60) కరోనా వైరస్‌తో మృతిచెందారు.

గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా వచ్చిన విషయాన్ని జూలై 4న ఆయనే స్వయంగా తెలియజేశారు.

ప్ర‌జ‌ల‌కు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరిస్తూ జాగ్రత్తలు పాటిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ఆయన్నే కరోనా కబళించ‌డం.. పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, మాణిక్యాలరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

బిగ్ బ్రేకింగ్.. క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts