వెండితెర‌పై న్యూడ్‌గా ప్ర‌భాస్ హీరోయిన్‌..!

August 13, 2020 at 9:18 pm

ఇటీవ‌ల హీరోయిన్లు వెండితెర‌పై న్యూడ్ గానో లేదా స‌గం న్యూడ్‌గానో క‌నిపించ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. ఇలాంటి క్యారెక్ట‌ర్ల ద్వారానే మ‌రింత పాపుల‌ర్ అవుతామ‌ని చాలా మంది హీరోయిన్లు.. చిన్నా చిత‌కా క్యారెక్ట‌ర్లు వేసుకునే వారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ సాహో బ్యూటీ అయిన బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ సైతం ఓ డేరింగ్ డెసిష‌న్ తీసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె వెండితెర‌పై ఓ న్యూడ్ రోల్‌లో క‌నిపించేందుకు రెడీ అవుతోంది.

శ్ర‌ద్ధ నటించే రోల్ మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం కావ‌డం మ‌రో విశేషం. కోలీవుడ్‌లో అమలాపాల్ నటించిన ఆడై (తెలుగులో ఆమె అనే టైటిల్ తో రిలీజైంది) సినిమాను ఇప్పుడు బీ టౌన్‌లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌లో న‌టించేందుకు శ్ర‌ద్ధ ఓకే చెప్పేసింద‌ట‌. ఆమె సినిమాలో అమ‌లాపాల్ పూర్తి న‌గ్నంగా న‌టించి పెద్ద సంచ‌ల‌నం రేపింది. ఇప్ప‌ట‌కీ ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఈ పాత్ర‌తో ఆమెకు గ‌త సినిమాల క‌న్నా ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది.

ఇప్పుడు శ్ర‌ద్ధ అదే రోల్ చేస్తాన‌న‌డం ద్వారా బీ టౌన్‌లో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం రేపారు. ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన రత్నకుమార్, హిందీ వెర్షన్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడు. వాస్త‌వానికి ఈ రీమేక్‌లో అమ‌ల చేసిన న్యూడ్ రోల్‌ను ముందుగా కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌తో చేయించాల‌ని అనుకున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ శ్రద్ధాకపూర్ చేతిలోకి వెళ్లింది. 

వెండితెర‌పై న్యూడ్‌గా ప్ర‌భాస్ హీరోయిన్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts