స్టార్‌ హీరో అక్షయ్ రేర్ రికార్డు.. గతేడాది ఎన్ని కోట్లు సంపాదించాడంటే?

August 12, 2020 at 3:17 pm

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవస‌రం లేదు. వరుస సినిమాతో ఎంతో బిజీగా ఉండే హీరో అక్షయ్ ‌కుమార్ తాజాగా ఓ రేర్ రికార్డు క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో చేరారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితాలో అక్షయ్‌కుమార్‌ ఛాన్స్‌ కొట్టేశాడు.

పోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి అక్షయ్‌ ఒక్కడే ఈ లిస్ట్‌లో చోటు సంపాదించడం విశేషం. ఇక అక్ష‌య్ కుమార్ 2019 జూన్‌ 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదించిన‌ట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన వార్షిక లెక్కలు తెలిపాయి. ఇక ఇందులో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్‌కు తొలి స్థానంలో నిలిచారు.

డ్వేన్ జాన్సన్ గతంలో రిజ్లింగ్ క్రీడాకారుడిగా అందరికి తెలిసిన వారే. ఈ జాబితాలో డ్వేన్ జాన్సన్ టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది రెండోసారి అని ఫోర్బ్స్ వెల్లడించింది. డ్వెయిన్ జాన్సన్ 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు 87.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 654 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ తర్వాత రెండో స్థానంలో ర్యాన్‌ రేనాల్డ్స్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, బెన్‌ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌, అక్షయ్‌కుమార్‌, లిన్‌-మాన్యుయల్‌ మిరండా, విల్‌స్మిత్‌, అడమ్‌ సాండ్లర్‌, జాకీ చాన్‌ వరుసగా టాప్ 10 లో నిలిచారు.

స్టార్‌ హీరో అక్షయ్ రేర్ రికార్డు.. గతేడాది ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts