బ్రేకింగ్: ఎట్టకేలకు కరోనా నుంచి కోలుకున్న అభిషేక్

August 8, 2020 at 3:27 pm

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనే స్వయంగా తాను కరోనా నుంచి కోలుకున్నాను అని ప్రకటన చేసారు. ఈ మధ్యాహ్నం నిర్వహించిన కరోనా టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా ప్రకటించిన అభిషేక బచ్చన్… తనకు వైద్య సేవలు అందించిన నానావతి ఆసుపత్రికి వైద్యులకు నర్సింగ్ స్టాఫ్ కి కృతజ్ఞతలు చెప్పారు. తాను ప్రామిస్ చేసినట్లుగా కరోనాని జయించాని ఆయన అన్నారు.

అదే విధంగా తాను తన కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. గత నెల 11 న ఆయనకు, ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్ కి కరోనా రాగా ముంబై లోని నానావతీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో అభిషేక్ చికిత్స తీసుకుని నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

బ్రేకింగ్: ఎట్టకేలకు కరోనా నుంచి కోలుకున్న అభిషేక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts