బ్రేకింగ్: మరో తెలంగాణ మంత్రికి కరోన పాజిటివ్

August 8, 2020 at 3:16 pm

తెలంగాణాలో కరోనా కేసులు సామాన్యులనే కాదు నాయకులను కూడా బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ నేతలు ప్రతీ రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. నేడు ఇద్దరు నేతలు కరోనా బారిన పడగా వారిలో ఒకరు ఎమ్మెల్యే మరొకరు సీనియర్ మంత్రి. నేడు ఉదయం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు అని అధికారులు వెల్లడించారు.

తాజాగా తెలంగాణా సీనియర్ మంత్రి మల్లారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకుండానే కరోనా సోకింది అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఆయన కుటుంబ సభ్యులను కొందరిని క్వారంటైన్ చేసారు. మంత్రి ఇప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా ఇటీవల సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

బ్రేకింగ్: మరో తెలంగాణ మంత్రికి కరోన పాజిటివ్
0 votes, 0.00 avg. rating (0% score)