బంపర్ ఆఫర్: హైదరాబాద్ లో పంచదార కొంటె డ్రగ్స్ ఫ్రీ…!

August 8, 2020 at 4:56 pm
drugs,hyderabad,హైదరాబాద్ , డ్రగ్స్

హైదరాబాద్ లో డ్రగ్స్ విషయంలో ఎన్ని విధాలుగా కట్టడి చర్యలు తీసుకున్నా సరే ఎక్కడో ఒక చోట మాత్రం డ్రగ్స్ ఏదోక రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి. డ్రగ్స్ విషయంలో పోలీసులు కఠినంగా ఉన్నా సరే ఏదోక రూపంలో అమ్ముతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ బయటపడ్డాయి. సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టుకున్నారు అధికారులు.Drugs Safety Issues After FDA Approval

ఎవరికి అనుమానం రాకుండా చక్కెర తో కలిపి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. లాక్ డౌన్ లో వ్యాపారం లాస్ రావడం తో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు హనుమాన్ రాం అనే వ్యాపారి. పక్కా సమాచారంతో రైడ్ చేయగా పక్కాగా దొరికిపోయాడు. దీనితో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అతని లింకులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

బంపర్ ఆఫర్: హైదరాబాద్ లో పంచదార కొంటె డ్రగ్స్ ఫ్రీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts