కొర‌టాల – బ‌న్నీ క‌థ అదేనా.. మ‌ళ్లీ అదే ఫార్ములా…?

August 3, 2020 at 3:00 pm

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య‌ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం క‌రోనా జోరుగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కొర‌టాల తెరకెక్కించిన భ‌ర‌త్ అనే నేను సినిమా తర్వాత కొరటాల ఆచార్య తెరకెక్కిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత వ‌స్తోన్న‌ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. కొర‌టాల‌కు అత్యంత సన్నిహితుడు అయిన మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

 

ఇక ఈ సినిమా కథ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లైన్ చూస్తుంటే కొర‌టాల మ‌రోసారి సామాజిక సందేశాన్నే న‌మ్ముకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. పల్లెటూరికి – పట్నానికి మధ్యన ఉన్న ఆంతర్యాన్ని సంబంధించి ఏదో కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనేది స్పష్టమైంది. ఈ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న క‌థేంటంటే గ్యాస్ లీకేజ్ ప్ర‌మాదాల‌కు సంబంధించి ఉంటుంద‌ట‌. గ‌త మే నెలలో వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీకేజి ఉదంతంతో పాటు తూర్పు గోదావ‌రి జిల్లా కోన‌సీమ‌లో త‌ర‌చూ గ్యాస్ లీకేజ్ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉండ‌డంతో వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి ఎలాంటి ఇబ్బంది జ‌రుగుతోందన్న‌దే ఈ సినిమా ప్ర‌ధాన ఇతివృత్తం అట‌.

 

ఈ గ్యాస్ లీకేజీల వ‌ల్ల ప‌ల్లెలు ఎలా క‌లుషితం అవుతున్నాయి.. వీటిని అడ్డుకోవడానికి స్టూడెంట్ లీడర్ గా అల్లు అర్జున్ ఎలాంటి సాహసాలు చేస్తాడో అనేది ఈ సినిమా నేపథ్యం అంటున్నారు. ఏదేమైనా సినిమా లైన్‌తోనే అల్లు అర్జున్ – కొర‌టాల శివ ఆస‌క్తి రేపారు. మ‌రి క‌రోనా ఎప్పుడు ముగిసి.. ఆచార్య ఎప్పుడు కంప్లీట్ అయ్యి… ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుందో ? చూడాలి.

కొర‌టాల – బ‌న్నీ క‌థ అదేనా.. మ‌ళ్లీ అదే ఫార్ములా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts