జేసి ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన కేసులు ఇవే…!

August 7, 2020 at 5:29 pm

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న వాహనాలను అడ్డుకున్న సిఐ దేవేంద్ర కుమార్ పై జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే సి. ఐ దేవేంద్ర కుమార్ , జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

సిఐ దేవేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు జెసి ప్రభాకర్ రెడ్డి పై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసిన తాడిపత్రి రూరల్ పోలీసులు… ఆయనపై 189,353,506 r/w 34 IPC 3(2)(va),3(1)r,3(1)s, sc,st poa act ,52 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసామని పోలీసులు వెల్లడించారు. ఆయన నిన్న సాయంత్రం కడప జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.

జేసి ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన కేసులు ఇవే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts