టీడీపీ ఇమేజ్ చంద్ర‌బాబుతోనే డ్యామేజ్‌… ఆ టీడీపీ ఎమ్మెల్యేలు అదే చెప్పారా…!

August 8, 2020 at 12:33 pm

అవును! ఇప్పుడు రాజ‌కీయ మేధావుల నుంచి విశ్లేష‌కుల వ‌ర‌కు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జాతీర్పు కోరాల‌ని గ‌గ్గోలు పెడుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాను అధికారంలో ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తి విష‌యంలో ఇలానే ప్ర‌జాతీర్పు కోరి.. దానిని రికార్డు చేసి, అసెంబ్లీలో పెట్టి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని అంటున్నారు. కానీ, అప్ప‌ట్లో చంద్ర‌బాబు దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌ధాని విష‌యంపై శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను కూడా ప‌ట్టించుకోలేద‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇదే జ‌గ‌న్ అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. ఈ విష‌యాన్ని చాలా సార్లు ప్ర‌స్థావించారు. త‌న మీడియా సాక్షిలోనూ శివ‌రామ‌కృష్ణ‌న్ నివేదిక‌ను ప్ర‌చారం చేశారు. అస‌లు నివేదిక‌లో ఉన్న‌ది ఒక‌టైతే.. చంద్ర‌బాబు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అప్ప‌ట్లోనే ఆయ‌న చెప్పారు. కానీ, అప్ప‌ట్లోనూ చంద్ర‌బాబు ఇలానే వితండ‌వాదం చేశారు. రాష్ట్రానికి మ‌ధ్య‌లో ఉంటుంద‌నే ఏకైక కార‌ణం చూపుతూ.. అమ‌రావ‌తిని ఆయ‌న నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోడానికి వీల్లేదంటూ.. ఓ జీవోను జారీ చేశార‌ని ఇప్పుడు వెలుగు చూసింది. దీనిని బ‌ట్టి.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం విలువ ఇవ్వ‌లేదు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ప్ర‌జాతీర్పు కోరండి అంటే.. ఎవ‌రు మాత్రం వింటారు.

ఇదే విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. మానాయుడికి అప్ప‌ట్లోనే చెప్పాం. మ‌నం ప్ర‌జ‌ల్లోకి వెళ్దాం. వారికి ఎక్క‌డ బాగుంటుంద‌ని చెబితే.. అక్క‌డ ప‌రిశీల‌న చేద్దాం. లేదా అఖిల ప‌క్షాన్ని పిలుద్దాం. వారి అభిప్రాయాలు తీసుకుందాం. అప్పుడు నిర్ణ‌యం తీసుకుందాం. అని సూచించామ‌ని, కానీ, మా నాయ‌కుడు అలా వినిపించుకోలేద‌ని, ఇప్పుడు మాత్రం గ‌గ్గోలు పెడుతున్నారు. దీనివ‌ల్ల ఆయ‌న ఇమేజ్‌తోపాటు పార్టీ ప‌రువు కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంద‌ని వారు అంటున్నారు. ఇది నిజ‌మే క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా. సో.. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో.. తెలుస్తుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

టీడీపీ ఇమేజ్ చంద్ర‌బాబుతోనే డ్యామేజ్‌… ఆ టీడీపీ ఎమ్మెల్యేలు అదే చెప్పారా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts