మ‌రో రెండు చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేసిన భార‌త్‌!!

August 4, 2020 at 4:03 pm

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భార‌త్ కేంద్ర ప్రభుత్వం ఇటీద‌ల ఏకంగా 59 చైనా యాప్‌లను బ్యాన్ చేసి.. డ్రాగన్‌ కంట్రీకి బిగ్ షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక తాజాగా ఆ దేశానికి చెందిన మరో రెండు యాప్‌లను బ్లాక్‌ చేసింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నివేదికల ప్రకారం వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను తీసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే కొంతకాలంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం డ్రాగన్ కంట్రీ చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ను ప్రారంభించింది.

మ‌రో రెండు చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేసిన భార‌త్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts