జగన్ వైపే ఏపీ ప్రజలు…కానీ ఆ విషయంలో బెస్ట్ కాదా?

August 8, 2020 at 10:51 am

జగన్ ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. ఇక ఈ ఏడాది కాలంలో అనేక సంచలన నిర్ణయాలు, మంచి పథకాలు అమలు చేశారు. అయితే జగన్ ఏడాది పాలన పట్ల ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా అవునని చెప్పొచ్చు. జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంలో పలు సర్వేల్లో కూడా తెలుస్తోంది.

తాజాగా ఇండియా టుడే జాతీయ న్యూస్‌ ఛానల్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఉత్తమ సీఎంల జాబితాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఉత్తమ సీఎంల జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.

ఇక జగన్ మూడో స్థానంలో, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగోస్థానంలో ఉండగా,  తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. అయితే తొలిసారి సీఎం పీఠం ఎక్కిన జగన్ ఇంత త్వరగా అత్యంత ప్రజాధరణ పొందిన సీఎంల జాబితాలో టాప్‌లో నిలవడానికి ప్రధాన కారణం…ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై సంక్షేమ వరాలు కురిపిస్తూనే ఉన్నారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని దాదాపుగా అమలు చేయడంతో, ప్రజలు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాల అమలు చేయడంతోనే జగన్ ఏపీ ప్రజల మనసులో చోటు దక్కించుకున్నారు. అయితే సంక్షేమ పథకాల విషయంలో మంచి మార్కులు కొట్టేసిన జగన్, అభివృద్ధి విషయంలో మాత్రం బెస్ట్ అనిపించుకోలేదని తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కానీ నిదానంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం అమలైతే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగే అవకాశాలున్నాయని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అభివృద్ధి కూడా జరిగితే రానున్న రోజుల్లో జగన్ నెంబర్ 1 స్థానంలోకి వస్తారని చెబుతున్నారు.

జగన్ వైపే ఏపీ ప్రజలు…కానీ ఆ విషయంలో బెస్ట్ కాదా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts