జ‌గ‌న్ బాట‌లో కేసీఆర్‌… ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌…!

August 6, 2020 at 10:12 am

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఏకంగా 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌డంతో పాటు ఎన్నో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. నూత‌న స‌చివాల‌యం డిజైన్‌కు ఆమోదం తెల‌ప‌డంతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు న‌లుమూల‌లా పారిశ్రామిక గ్రిడ్‌లు ఏర్పాటు చేయాల‌ని తీర్మానించారు. ఇక రాష్ట్రంలో నియంత్రిత పంట‌ల సాగు, టీఎస్ బిల్డింగ్ పాస్ లాంటి అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ జ‌గ‌న్ బాట‌లోనే న‌డిచేలా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ గ‌తంలోనే స్థానికంగా పెట్టే ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే తీర్మానించారు. ఇప్పుడు కేసీఆర్ సైతం జ‌గ‌న్ బాట‌లోనే ముందుకు వెళుతున్నారు.

స్థానికంగా నెలకొల్పే పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే లభించేలా నూతన విధానానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానికుల‌ను ఎక్కువుగా ఉద్యోగాల్లోకి తీసుకునే ఇండ‌స్ట్రీల‌కు అద‌న‌పు ప్రోత్సాహాలు కూడా ఇవ్వాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యించ‌డం మ‌రో విశేషం. తెలంగాణ యువ‌త‌కు భారీ ఎత్తున ఉద్యోగాలు ల‌భించేలా చేయ‌డ‌మే ఈ ప్లాన్ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. ఇందుకోసం తెలంగాణ కేబినెట్ ప‌రిశ్ర‌మ‌ల‌ను రెండు కేట‌గిరిలుగా విభ‌జించింది. మెదటి కేట‌గిరి ప‌రిశ్ర‌మ‌ల్లో ఖ‌చ్చితంగా స్థానికుల‌కు 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. రెండో విభాగం పరిధిలోకి వచ్చే పరిశ్రమల్లో స్కిల్డ్ వర్కర్లలో 60 శాతం మంది స్థానికులు, సెమీ స్కిల్డ్ వర్కర్లలో 80 శాతం మంది స్థానికులు ఉండాలని పేర్కొంది.

ఇక రాష్ట్రానికి వ‌స్తోన్న ప‌రిశ్ర‌మ‌లకు ముందు అనుమ‌తి ఇచ్చేట‌ప్పుడే స్థానిక యువ‌త‌కు ఎక్కువ ఉద్యోగాలు ద‌క్కేలా కూడా పాల‌సీని రూపొందించాల‌ని సీఎం కేసీఆర్ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ పాల‌సీ కూడా రూపొందింది. ఏదేమైనా కేసీఆర్ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క తెలంగాణ‌లో ఇక‌పై ఏర్పాటు అయ్యే అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ తెలంగాణ యువ‌త‌కే పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భ్యం కానున్నాయి. ఏపీలో జ‌గ‌న్ ఏవిధంగా అయితే స్థానిక ఉద్యోగాలు స్థానికుల‌కే అన్న కాన్సెఫ్ట్‌తో ముందుకు వెళుతున్నారో ఇప్పుడు కేసీఆర్ సైతం అదే బాట‌ను ఎంచుకున్నారు.

జ‌గ‌న్ బాట‌లో కేసీఆర్‌… ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts