షాకింగ్ న్యూస్‌.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క‌రోనా!!

August 7, 2020 at 11:33 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. చైనాలో పుట్టి ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న క‌రోనా.. ఇంకెంత‌మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకావ‌డం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇక తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన స్వయంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని… డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సీఎం రమేశ్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు.

రమేశ్ కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

షాకింగ్ న్యూస్‌.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క‌రోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts