మోదీని సాయం చేయ‌మంటూ.. సీఎం జగన్ స్పెషల్ రిక్వెస్ట్..!!

August 11, 2020 at 2:27 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి.. ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద గండంగా మారింది. ఇక భార‌త్‌లోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 60వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేటి ఉదయం 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీకి ఏపీ సీఎం జగన్ పలు వివరాలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర సహాయ సహకారాలు అందించాలని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవని.. ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవన్నారు.

ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు, ఏపీలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని జగన్ చెప్పారు. ప్రతి 10 లక్షల మందికి 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. తాము సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే కరోనా విషయంలో రోగులుకు సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామని.. పేషెంట్లను త్వరగా అడ్మిట్ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని ప్రధాని మోదీకి జ‌గ‌న్ తెలిపారు.

మోదీని సాయం చేయ‌మంటూ.. సీఎం జగన్ స్పెషల్ రిక్వెస్ట్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts