జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. నేడు వారి ఖాతాల్లోకి రూ.18,750!!

August 12, 2020 at 9:20 am

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.. ప్ర‌జ‌ల‌ను ఎన్ని తిప్ప‌లు పెడుతుందో చూస్తేనే ఉన్నాం. చైనాలో మొద‌లైన క‌రోనా.. క్ర‌మంలో ప్ర‌పంచ‌దేశాల‌కు వ్యాప్తిచెంది ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి స‌మ‌యంలోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాల‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అండగా నిలుస్తున్నారు.

ఇక తాజాగా సీఎం జ‌గ‌న్ నేడు మ‌రో సంచ‌ల‌న ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు సిద్ధమ‌య్యారు. నేడు వైఎప్సార్ చేయూత స్కీమ్‌ను ముఖ్య‌మంత్రి ప్రారంభించనున్నారు. క‌రోనా నేప‌థ్యంలో సీఎం క్యాంపు ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని లాంఛ‌నంగా స్టార్ట్ చేయ‌నున్నారు. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.

నేడు 25 లక్షల మంది అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. కాగా, మహిళల‌కు ఆర్థిక చేదోడు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి స‌హకారం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత వంటి రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి ఈ చర్యలు తోడ్పాటునందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు ఈ ప‌థ‌కం వర్తిస్తుంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ పేర్కొంది.

జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. నేడు వారి ఖాతాల్లోకి రూ.18,750!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts