చెత్త ఏరుకునే అవ్వ ఇంట్లో బిందెల నిండా నాణేలే.. వాటి విలువ ఎంతో తెలుసా..?

August 14, 2020 at 3:40 pm

తమిళనాడులో రోడ్డు పక్కన నివసించేవారింట్లో అక్షరాలా రూ. 2 లక్షలు విలువ చేసే నాణేలు దొరికాయి.చెన్నై, ఒట్టేరి, సత్యవాణిముత్తు నగర్​కు చెందిన రాజేశ్వరి (65), విజయలక్ష్మి (60), ప్రభావతి (57)లకు ఇల్లు ఉన్నా.. రోడ్డు పక్కనే నివసించేవారు. దీంతో పోలీసులు వారి ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంట్లో లభ్యమైన ప్లాస్టిక్ బిందెల్లో నింపిన చిల్లర నాణేలు, ఏడు సవర్ల బంగారం, రూ. 40 వేలు విలువ చేసే రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లు లభ్యమయ్యాయి. ఇవి చూసి ఇరుగుపొరుగువారు విస్తుపోయారు.

ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యన లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ మహానగరంలో ఓ బిచ్చగాడు నడిరోడ్డుపై తనువు చాలించాడు. అయితే తన పరిసర ప్రాంతాలలో తన దాచిన డబ్బు 10 లక్షలకు పైగా ఉంది అని అధికారులు తెలిపారు. ఇదేవిధంగా బెంగళూరులో ఓ ముసలి అవ్వ చనిపోయాక తన దగ్గర ఉన్న బ్యాంకు ఖాతా బుక్ లో 14 లక్షలు ఉండడం చూసి అధికారులు షాక్ అయ్యారు.

చెత్త ఏరుకునే అవ్వ ఇంట్లో బిందెల నిండా నాణేలే.. వాటి విలువ ఎంతో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)