ఏపీలో వ‌చ్చే నెల నుంచి తగ్గనున్న కరోనా జోరు!!

August 11, 2020 at 8:27 am

ప్ర‌పంచ‌దేశాలుకు క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. ఈ వైర‌స్ ఎటు నుంచి.. ఎప్పుడు.. ఎలా ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు భ‌యంభ‌యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలోనూ క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది.

అయితే సెప్టెంబర్ రెండో వారం నాటికి ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు(కొవిడ్ కంట్రోల్ రూం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి) చెబుతున్నారు. రాష్ట్రంలో హెర్డ్ ఇమ్యూనిటీ 15 శాతంపైనే ఉందని గుర్తించామని, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ రేటు తదితర అంశాలను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ నెల 21 నుంచి కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో, వచ్చే నెల 4 నుంచి గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఇక ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 మరణాలు నమోదవుతుండగా.. ఆగష్టు‌ 20 తరువాత 50 కంటే తగ్గే అవకాశాలున్నాయని, అలాగే మరణాల శాతం 0.5శాతం కంటే తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఇదే గ‌నుక జ‌రిగితే.. ప్ర‌జ‌లు కాస్త ఊర‌ట‌పొందుతారు.

ఏపీలో వ‌చ్చే నెల నుంచి తగ్గనున్న కరోనా జోరు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts