కృష్ణాష్ట‌మిపై క‌రోనా దెబ్బ‌.. ఇంట్లోనే వేడుక‌లు!!

August 11, 2020 at 8:54 am

నేడు శ్రీకృష్ణుడి జన్మదినం `శ్రీకృష్ణాష్టమి` సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించినట్టు పురాణ ప్రసిద్ధి. అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురక్షేత్రాన్ని నడిపించిన మహా యోధుడు.

ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణాష్ట‌మిపై క‌రోనా దెబ్బ ప‌డింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ బ‌య‌ట‌కురాని ప‌రిస్థితి. క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈసారి మధురతో సహా పలు ప్రధాన దేవాలయాలలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే చిన్నికృష్ణునికి స్వాగ‌త స‌త్కారాలు చేస్తున్నారు.

ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు జరుపుకుంటున్నారు. కాగా, ఈ రోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. పురాణాల ప్రకారం ఇప్పటికీ శ్రీ కృష్ముడు జన్మించి 5246 సంవత్సరాలైందని అంచనా. ఇక ఉదయం 9.07 గంటల నుంచి ఆగస్టు 12 ఉదయం 11.16 గంటల వరకు అష్టమి తిథి కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మనం కృష్ణుడిని ఆరాధించడం శుభసూచకమ‌ని చెబుతున్నారు.

కృష్ణాష్ట‌మిపై క‌రోనా దెబ్బ‌.. ఇంట్లోనే వేడుక‌లు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts