దీపావళి నాటికి కరోనా ఖ‌తం అవుతుందంటున్న కేంద్రమంత్రి!

August 31, 2020 at 7:39 am

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. మొద‌ట లైట్‌గా తీసుకున్న ప్ర‌జ‌లు క‌రోనా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2కోట్ల 53లక్షలు దాటింది.

Harsh Vardhan: Union health minister Harsh Vardhan to be WHO Chairman |  India News - Times of India

అటు మ‌ర‌ణాల సంఖ్య 8.5 ల‌క్ష‌లు మించిపోయింది. ఈ మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టే స‌రైన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తియ్య‌ని వార్త చెప్పారు. రాబోయే దీపావళి నాటికి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని చాలా వ‌ర‌కూ అదుపులోకి తీసుకురాగ‌లుగుతామ‌ని అన్నారు.

అనంత్‌కుమార్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన నేష‌న్ ఫ‌స్ట్ వెబ్ సెమినార్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్ట‌ర్ దేవీ ప్ర‌సాద్ శెట్టి, డాక్ట‌ర్ సీ ఎన్ మంజునాథ్ త‌దిత‌ర నిపుణులు తెలిపిన విధంగా కొంతకాలం త‌రువాత కూడా ఇది కూడా మిగిలిన వైర‌స్‌ల మాదిరిగానే ఒక సాధరణ స‌మ‌స్య‌గా మిగిలిపోతుంద‌న్నారు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న జీవన‌శైలిలో వివిధ‌ మార్పులు చేసుకుంటూ, ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

దీపావళి నాటికి కరోనా ఖ‌తం అవుతుందంటున్న కేంద్రమంత్రి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts