టీడీపీకి క‌రోనా క‌ష్టాలు… త‌ల‌ప‌ట్టుకున్న త‌మ్ముళ్లు..!

August 12, 2020 at 9:26 am

భ‌యంక‌ర క‌రోనా.. ప్ర‌జ‌ల‌ను ఓ ప‌క్క వేధిస్తున్న విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోను, ప్ర‌పంచంలోనూ ఈ ఏడాది అన్ని ప‌నులు దాదాపు ఆగిపోయాయి. ఏ ఒక్క ప‌నికూడా ముందుకు సాగ‌డం లేదు. ఆర్థిక న‌ష్టాలు స‌రేస‌రి. ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ఎక్క‌డిక‌క్క‌డ నూత‌న ప‌నులు ఆగిపోయాయి. పెళ్లిళ్లు జ‌రుగుతున్నా క‌ళ‌లేకుండా పోయింది. ప‌ట్టుమ‌ని ప‌ది మంది ఒక్క‌చోట గుమికూడే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా రైళ్లు లేవు. బ‌స్సులు ఉన్నా.. క‌రోనా క‌ల‌కలం వెంటాడుతూనే ఉంది. దీంతో సాధార‌ణ జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారిపోయింది.

మ‌రీ ఈ స‌మ‌స్య ఒక్క సాధార‌ణ ప్ర‌జ‌ల‌కేనా ? పార్టీలు, రాజ‌కీయ నేత‌ల‌కు లేదా? అంటే.. ఉంది..! ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయంగా కునారిల్లుతున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఏపీ స‌హా ఏడు రాష్ట్రాల్లో నిలిచిపోయాయి. ఎప్పుడు జ‌రుగుతాయో తెలియ‌దు. ఇక‌, బైపోల్స్‌ కూడా చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయాయి. ఈ ప‌రిణామం రాజ‌కీయ నేత‌ల‌పై తీవ్రంగానే ఉంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి కంటిపై కునుకులేకుండా పోతోంది. స‌భ‌లు నిర్వ‌హించేందుకు అవ‌కాశం లేదు. స‌మావేశాల‌కు తావులేదు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేందుకు అస‌లే ఆస్కారం లేదు. దీంతో పార్టీ తీవ్ర‌స్థాయిలో త‌ల్ల‌డిల్లుతోంది.

వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అమ‌రావ‌తిపై ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. నేత‌లను కూడా ఉన్నంత వ‌ర‌కు , త‌నతో క‌లిసి వ‌చ్చేవారి వ‌ర‌కు ఆహ్వానించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. జ‌గ‌న్ స‌ర్కారుపైనా, కేంద్రంపైనా విరుచుకుప‌డి అంతో ఇంతో పార్టీకి బూస్ట‌ప్ చేసుకోవాల‌ని భావించారు. కానీ, అనూహ్యంగా క‌రోనా ఎఫెక్ట్ పార్టీ ప్ర‌ణాళిక‌ను దెబ్బ‌తీసింది. కాలు తీసి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో క‌నిపిస్తోంది.

ఎక్క‌డిక‌క్క‌డ కేసులు పెరిగిపోయాయి. రోజులు దాదాపు వంద‌కు చేరువ‌లో మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నారు. దీంతో టీడీపీ చేయాల‌ని అనుకున్న రాజ‌కీయాలు, ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చేసుకున్న ప్ర‌య‌త్నాలు కూడా కొర‌గాకుండా పోయాయి. ఈ ప‌రిణామాల‌తో త‌మ్ముళ్లు.. వారిని చూసి పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా త‌ల్ల‌డిల్లుతున్నారు.

టీడీపీకి క‌రోనా క‌ష్టాలు… త‌ల‌ప‌ట్టుకున్న త‌మ్ముళ్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts