అమెరికాలో క‌రోనా వీర విహారం.. ఒక్క‌రోజులో రెండు వేల మంది మృతి!!

August 7, 2020 at 4:20 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బీభ‌త్సం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో తెలియ‌డం లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి అంతు చూసేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. రోజురోజుకు ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ మ‌రింత వేగంతో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేని క‌రోనా కాటుకు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.

మాన‌వుళ‌ను ర‌క్షించేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు.. క‌రోనా విరుగుడుకు వంద‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో క‌రోనా మ‌ళ్లీ వీరి విహారం చేస్తోంది. మే నెల తొలివారంలో ఒక్కరోజే 2 వేల మంది మరణించగా, ఆ తర్వాత ఆ స్థాయిలో మరణాలు సంభవించలేదు. మళ్లీ నిన్న ఒక్కరోజే 2 వేల మరణాలు నమోదవడం తాజా పరిస్థితికి నిదర్శనం.

ప్ర‌స్తుతం కరోనా మృతుల సంఖ్య 3 లక్షలకు చేరువ అవుతోంది. మ‌రోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా, వారిలో 1.60 లక్షల మంది మృత్యువాత పడ్డారు. నిత్యం 50 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

అమెరికాలో క‌రోనా వీర విహారం.. ఒక్క‌రోజులో రెండు వేల మంది మృతి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts