భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 17 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు!!

August 1, 2020 at 10:24 am

క‌రోనా వైర‌స్‌.. చైనాలో పుట్టికొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎటు నుంచి వ‌చ్చి ఈ క‌రోనా భూతం కాటేస్తుందో తెలియ‌క వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి కావ‌లం లేదు. ఇక భార‌త్‌లోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 57,117 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 16,95,988 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే 764 మంది క‌రోనాకు బ‌లైపోయారు. తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 36,511కి పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 36,569 మంది డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,94,374 మంది కోలుకోగా.. 5,65,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 1,93,58,659 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 17 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts