భారత్‌లో క‌రోనా క‌ల్లోలం.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు!!

August 3, 2020 at 10:15 am

క‌రోనా వైర‌స్‌.. చైనాలో పుట్టికొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎటు నుంచి వ‌చ్చి ఈ క‌రోనా భూతం కాటేస్తుందో తెలియ‌క వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇక భార‌త్‌లోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.

ప్ర‌స్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 18,03,696 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే 771 మంది క‌రోనాకు బ‌లైపోయారు. తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 38,135కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకోగా.. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో ఇండియా టాప్ 3లో ఉంది. రోజువారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానానికి చేరింది. ఇక మొత్తం మరణాల్లో ఇండియా టాప్ 5లో ఉంది.

భారత్‌లో క‌రోనా క‌ల్లోలం.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts