భార‌త్‌లో వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా కేసులు.. తాజా లెక్క ఇదే!!

August 5, 2020 at 10:46 am

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టికొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎటు నుంచి వ‌చ్చి ఈ క‌రోనా భూతం కాటేస్తుందో తెలియ‌క వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇక భార‌త్‌లోనూ రోజురోజుకు న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య చూస్తుంటే వ‌ణుకుపుట్టిస్తోంది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 52,509 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 19,08,255 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే ఏకంగా 857 మంది క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 39,795కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,215 మంది కోలుకోగా.. 5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో ఇండియా టాప్ 3లో ఉంది. అయితే రికవరీ రేటు మాత్రం ఇండియాలో 67.2 శాతానికి చేరింది. ఇది కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం.

భార‌త్‌లో వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా కేసులు.. తాజా లెక్క ఇదే!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts