భార‌త్‌లో ఆగ‌ని క‌రోనా.. నిన్న ఒక్క‌రోజే వెయ్యికి పైగా మ‌ర‌ణాలు!

August 19, 2020 at 10:13 am

చైనాలోని వూహాన్ న‌గంలో పురుడుపోసుకున్న క‌రోనా వైర‌స్.. ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా భార‌త్‌లో క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

తాజాగా భార‌త్‌లో నిన్న‌ ఒక్క‌రోజే వెయ్యికి పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 64,531 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 27,67,274 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే ఏకంగా 1,092 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 52,889 కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకోగా.. 6,76,514 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 3,17,42,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి.. 73.6 శాతానికి చేరింది. ఇది కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యంగా చెప్పుకోవ‌చ్చు. ఇక మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.

భార‌త్‌లో ఆగ‌ని క‌రోనా.. నిన్న ఒక్క‌రోజే వెయ్యికి పైగా మ‌ర‌ణాలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts