భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 22 ల‌క్ష‌లు దాటేసిన పాజిటివ్ కేసులు!

August 11, 2020 at 11:24 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టికొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.. క‌రోనా అదుపులోకి రాలేదు. ఇక వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి కావ‌డం లేదు. భార‌త్‌లోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది.

తాజాగా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 22 లక్షలు దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో ఏకంగా 53,601 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 22,68,676 లక్షలకు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే ఏకంగా 871 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 45,257కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 15,83,490 మంది కోలుకోగా.. 6,39,929 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉండగా… రోజువారీ కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో ఉంది. అయితే భార‌త్‌లో క‌రోనా కేసుల‌తో పాటు రికవరీ రేటు కూడా పెర‌గ‌డం కాస్త ఊర‌ట‌నిస్తోంది.

భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 22 ల‌క్ష‌లు దాటేసిన పాజిటివ్ కేసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts