తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం.. 70 వేలు దాటిన పాజిటివ్ కేసులు!!

August 5, 2020 at 10:01 am

క‌రోనా పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అతిసూక్ష్మ‌జీవి క‌రోనా వైర‌స్ చైనాలో పుట్టి.. అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు చూట్టేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా ధాటికి ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సిన్ త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో.. వివిధ దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప‌నిలోపడ్డారు. అయితే క‌రోనా వ‌చ్చి ఏడు నెల‌లు గ‌డుస్తున్నా.. విరుగుడు రాక‌పోవ‌డంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల మార్క్‌ను దాటి.. 70,958కి చేరింది.

అలాగే నిన్న ఒక్క‌రోజే 1,139 మంది కోలుకోగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 576కు చేరింది. ఇక ఇప్ప‌టికే క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 50,814 మందికి పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆసుపత్రుల్లో 19,568 మందికి చికిత్స అందుతోంది. రాష్ట్రంలోని కేసులతో పోలిస్తే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట‌‌నిచ్చే విషయం.

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం.. 70 వేలు దాటిన పాజిటివ్ కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts