తెలంగాణ‌లో వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా.. 80 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు!!

August 9, 2020 at 9:58 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. అంతు చూసేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. రోజురోజుకు ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ మ‌రింత వేగంతో విజృంభిస్తోంది. ఇక తెలంగాణ‌లోనూ క‌రోనా వైర‌స్ వ‌ణుడు పుట్టిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీలో 463, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 141, రంగారెడ్డి జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 100 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 80 వేల‌కు చేరువ‌లో.. 79,495 ద‌గ్గ‌ర నిలిచింది. ఇక నిన్న 12 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 627కి పెరిగిందని వెల్లడించింది. అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1669గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 55,999కు చేరుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

తెలంగాణ‌లో వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా.. 80 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts