తెలంగాణ‌లో చెల‌రేగుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!!

August 6, 2020 at 10:03 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. అంతు చూసేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. రోజురోజుకు ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ మ‌రింత వేగంతో విజృంభిస్తోంది. ఇక తెలంగాణ‌లోనూ క‌రోనా అడ్డు అదుపు లేకుండా చెల‌రేగిపోతోంది.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్ ప్ర‌కారం.. . గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 535 కేసులు వున్నాయి. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 169 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 126, కరీంనగర్ జిల్లాలో 123, వరంగల్ పట్టణ పరిధిలో 128 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుంది.

ఇక నిన్న 13 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కి పెరిగిందని వెల్లడించింది. అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1289గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 52103కు చేరుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 20,358 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

తెలంగాణ‌లో చెల‌రేగుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts