షాకింగ్ న్యూస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ తేజకు క‌రోనా!!

August 3, 2020 at 2:32 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొన్ని లక్షల మందికి పైగా ఈ వైర‌స్‌ సోకింది. వ్యాక్సిన్‌లేని ఈ క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాలు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇక మ‌రోవైపు సామాన్యుల‌తో పాటు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.

నిన్న‌టికి నిన్న‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ మహమ్మారి బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. గత వారం తేజ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేశారు. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేశారు వైద్యులు.

ఈ రిపోర్టుల్లో తేజ‌కు పాజిటివ్‌రాగా.. మిగ‌తావారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. ఇక‌ ప్ర‌స్తుతం తేజ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవ‌ల ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మ‌రియు ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

షాకింగ్ న్యూస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ తేజకు క‌రోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts