ఫేస్​బుక్​ వెర్షన్​లో కీలక మార్పు ఎలా ఉంటుందో తెలుసా..?

August 22, 2020 at 5:55 pm

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తన వెబ్‌ వెర్షన్‌లో మార్పులు చేయబోతోంది. ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న తన క్లాసిక్‌ లుక్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పనుంది. యూజర్లందరికీ కొత్త లుక్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మనం ఫేస్‌బుక్‌ తెరవగానే నీలం చార, తెలుపు, నలుపు అక్షరాలు దర్శనమిస్తాయి. ఏళ్లుగా ఇదే యూఐలో ఫేస్‌బుక్‌ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తోంది. తాజాగా కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొందరికి ప్రయోగాత్మకంగా ఈ లుక్‌ అందుబాటులోకి తెచ్చింది. వారికి తమ పాత లుక్‌లో మారేందుకు వీలుగా డ్రాప్‌డౌన్‌ మెనూలో క్లాసిక్‌ లుక్‌కు మారే వీలు కల్పిస్తోంది.

అయితే, సెప్టెంబర్‌ నుంచి ఇక క్లాసిక్‌ లుక్‌కు గుడ్‌బై చెప్పాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ఇకపై అందరికీ న్యూ లుక్‌ మాత్రమే కనిపించనుంది. గతంలో కనిపించే నీలి చారకు కొత్త వెర్షన్‌లో ఫేస్‌బుక్‌ స్వస్తి చెప్పింది. కొత్తగా డార్క్‌మోడ్‌ను పరిచయం చేసింది. కొత్త లుక్‌లో సెర్చ్‌, హోమ్‌, వాచ్‌, మార్కెట్‌ప్లేస్‌, గ్రూప్స్‌, గేమింగ్‌ పేజెస్‌, ప్రొఫైల్‌, క్రియేట్‌, మెసెంజర్‌, నోటిఫికేషన్‌, డ్రాప్‌డౌన్‌ మెనూ విడివిడిగా పెద్ద ఐకాన్స్‌తో కనిపిస్తున్నాయి. గతంలో పోలిస్తే లోడింగ్‌లో వేగం, స్క్రోలింగ్‌‌లో స్మూత్‌నెస్‌ ఇందులో ప్రత్యేకతంగా కనిపిస్తాయి.

ఫేస్​బుక్​ వెర్షన్​లో కీలక మార్పు ఎలా ఉంటుందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts