షాకింగ్ న్యూస్‌.. దుబ్బాక ఎమ్మెల్యే హఠాన్మరణం!

August 6, 2020 at 8:09 am

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పొందుతూ.. గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచార‌ని కుటుంబీకులు వెల్లడించారు. ఆయన కాలికి ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో మళ్లీ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. సోలిపేట రామలింగారెడ్డి స్వస్థలం చిట్టాపూర్ గ్రామం కాగా, ఆయనకు భార్య సుజాత, కుమారుడు సతీశ్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు.

2004లో తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆపై 2009లో ఓటమి పాలైనా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మ‌ళ్లీ గెలిచి స‌త్తా చాటారు. కాగా, రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో విషాదఛాయలు అలముకోగా, టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

షాకింగ్ న్యూస్‌.. దుబ్బాక ఎమ్మెల్యే హఠాన్మరణం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts