ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న కరోనా.. డైరెక్టర్ తరువాత నిర్మాతకు పాజిటివ్!

August 8, 2020 at 8:34 am

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళికి ఇటీవల కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్లు, ఆయన తన ఫాం హౌజ్‌లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో చిత్ర వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరిగా అందరికీ కరోనా పాజిటివ్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చూసిన చిత్ర యూనిట్‌కు ఇలా కరోనా సోకుతుండటంతో ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన చిత్ర యూనిట్ సభ్యులు వీలైనంత త్వరగా కోలుకోవాలని వారు కోరుతున్నారు.

ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న కరోనా.. డైరెక్టర్ తరువాత నిర్మాతకు పాజిటివ్!
0 votes, 0.00 avg. rating (0% score)