వైసీపీని వెంటాడుతున్న విషాదాలు.. సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!!

August 12, 2020 at 7:49 am

అధికార పార్టీ వైసీపీని ఇటీవ‌ల వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం మ‌ర‌వ‌క ముందే వైసీపీలో మ‌రో విషాదం అలుముకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు ఖలీల్ బాషా‌.

హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి చెందారు. ఆయ‌న‌ మ‌ర‌ణంతో కుటుంబ స‌భ్యులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఖలీల్ బాషా‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేశాడు ఖలీల్ బాషా.

తర్వాత ప్రజా రాజ్యం పార్టీలో చేరారు.. తర్వాత రాజకీయంగా కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. ఇక ఖ‌లీల్ బాషా 2019 ఫిబ్ర‌వ‌రి 5న టీడీపీకి గుడ్ బై చెప్పి, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో తన ముగ్గురు కుమారులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విజయానికి కృషి చేశారు. అయితే ఇప్పుడు ఖ‌లీల్ బాషా మృతి పార్టీకి తీరని లోట‌ని పార్టీ నేత‌లు.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

వైసీపీని వెంటాడుతున్న విషాదాలు.. సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts