ఇక‌పై సోనూ సూద్‌ను అలా ఊహించుకోవ‌డం ఫ్యాన్స్ క‌ష్ట‌మే!!

August 1, 2020 at 8:58 am

సోనూ సూద్.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈయ‌న పేరే వినిపిస్తోంది. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ, క‌రోనా లాక్‌డౌన్ మొద‌ల‌య్యాక‌.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు సోనూ సూద్‌. వలస కార్మికులను ఇళ్లకు చేర్చిడంలో మొదలైన ఆయన సామాజిక సేవ కొనసాగుతుంది. దేశంలోని ఎవరు కష్టంలో ఉండి సాయం అడిగినా సోనూ సూద్ వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు.

సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో అని ఈ మూడు నెల‌ల్లోనూ నిరూపించుకున్నారు. ఈ క్ర‌మంలోనే స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా సోనూ సూద్ ముందు బలాదూర్ అంటున్నారు అభిమానులు. నువ్వే మా రియల్ హీరో అంటున్నారు పొగిడేస్తున్నారు. అయితే సోనూ సూద్ కి వచ్చిన క్రేజ్ రీత్యా ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. టాలీవుడ్ లో మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలో విలన్ పాత్రల కోసం ఆయన్ని సంప్రదిస్తున్నారట.

కానీ, ఇక్క‌డే చిక్కొచ్చి ప‌డింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సోనూ సూద్ వ్య‌క్తిత్వం గురించి తెలియదు కాబ‌ట్టి, ఆయ‌న్ను విల‌న్‌గా అంగీక‌రించారు. హీరోలు కొడుతుంటే కూడా సరే అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోనూ సూద్ ఇంత మంచివాడని తెలిశాక, అతన్ని ఆన్ స్క్రీన్ లో విలన్ గా ప్రేక్షకులు అంగీకరించరేమో అనే సందేహం వ్యక్తం అవుతుంది. అస‌లు సోనూ సూద్‌ను విల‌న్‌గా ఊహించుకోవ‌డం కూడా ఫ్యాన్స్ క‌ష్ట‌మే అని అంటున్నారు.

ఇక‌పై సోనూ సూద్‌ను అలా ఊహించుకోవ‌డం ఫ్యాన్స్ క‌ష్ట‌మే!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts