బర్త్ డే రోజే కరోనాను జయించిన మాజీ ముఖ్యమంత్రి…!

August 12, 2020 at 7:21 pm

ఇటీవల కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దిరామయ్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక తాజాగా సిద్దిరామయ్యకు వైద్యులు జరిపిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో ఆయన కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు అయింది. ఇక ఇందులో మరో విశేషం ఏమిటి అంటే నేడు సిద్దిరామయ్య పుట్టినరోజు.

ఆయనకు గత కొంత కాలం నుండి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా, వాటి తీవ్రత ఎక్కవ కావడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆయనకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆయనకు కరోనా పరిక్షలు చేయడంతో ఆయనకు కరోనా పాజిటివ్ తేలింది. అయితే ఆ తర్వాత కొంత వైద్య చికిత్స తీసుకున్న ఆయన సరిగ్గా పుట్టినరోజు నాడు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక సిద్దిరామయ్య గురువారం నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లు వైద్య అధికారులు తెలియజేశారు.నేడు సిద్దిరామయ్య 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈయన కర్ణాటక రాజకీయాలలో 2013 – 2018 వరకు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బర్త్ డే రోజే కరోనాను జయించిన మాజీ ముఖ్యమంత్రి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts