షాకింగ్ న్యూస్‌.. మ‌రో మాజీ ఎంపీని బ‌లితీసుకున్న క‌రోనా!

August 14, 2020 at 4:05 pm

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. చైనాలో పుట్టి ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న క‌రోనా.. ఇంకెంత‌మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకావ‌డం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

అందులో కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే తాజాగా మ‌రో మాజీ ఎంపీని క‌రోనా బ‌లితీసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఘ‌జియాబాద్ మాజీ ఎంపీ సురేంద్ర ప్ర‌కాష్ గోయ‌ల్ మృతి చెందారు. రెండు, మూడు రోజుల క్రితం ఆయ‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌నను వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య ప‌రిస్థితి మరింత‌ క్షీణించ‌డంతో.. ఇవాళ ఉద‌యం ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక మాజీ ఎంపీ గోయ‌ల్ మృతికి కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

షాకింగ్ న్యూస్‌.. మ‌రో మాజీ ఎంపీని బ‌లితీసుకున్న క‌రోనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts