వైసీపీలోకి గంటా.. ముహూర్తం ఫిక్స్‌!!

August 1, 2020 at 10:44 am

గ‌త కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖలో రాజకీయంగా పట్టు సాధించాల‌ని భావిస్తున్న‌ వైసీపీ.. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది.

ఈ నేప‌థ్యంలోనే విశాఖ రాజకీయాల్లో కీలకమైన నేత, మాజీ మంత్రి గంటాను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అంతేకాదు, ఆగస్టు 9వ తేదిన వైసీపీలో ఆయన చేరికకు ముహూర్తం ఖరారైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తొలుత ఆగస్టు 15న ఆయన వైసీపీలో చేరతారని భావించినా తాజాగా ఇది ఆగస్టు 9కు మారినట్లు తెలుస్తోంది.

అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన గంటా శ్రీనివాసరావు గతంలో కాంగ్రెస్ పార్టీతో మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంత్రిగా వ్యవహరించారు. తాజాగా గతేడాది మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా ఇప్పుడు వైసీపీ కండువ క‌ప్పుకోబోతున్నారు.

వైసీపీలోకి గంటా.. ముహూర్తం ఫిక్స్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts