మౌత్‌వాష్‌తో కరోనా ఖ‌తం.. పరిశోధకులు ఏమన్నారంటే?

August 12, 2020 at 1:03 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టిన క‌రోనా.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలకు వ్యాప్తి చెంది అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌. మ‌రోవైపు క‌రోనా నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు వేళ ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇక తాజాగా మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీలో ఇటీవ‌ల జ‌రిపిన ప‌రిశోధ‌నలో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని నిపుణులు పేర్కొన్నారు.

అయితే మౌత్‌వాష్ వాడుతున్నంత మాత్రాన కరోనా వైరస్ సోకదని గ్యారెంటీ లేదన్నారు. వైరస్ సోకే అవకాశాల్ని మౌత్‌వాష్‌లు తగ్గిస్తాయే తప్ప… కరోనా పాజిటివ్ రాదనేందుకు గ్యారెంటీ లేదని చెప్పారు. అందుకే మౌత్‌వాష్‌లను కరోనాకు చికిత్సగా భావించరాదని.. కేవ‌లం ఇత‌రుల‌కు వ్యాప్తి చెంద‌కుండా క‌రోనాను వైర‌స్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మౌత్‌వాష్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పాలి. మ‌రియు సాధారణంగా వాడే మౌత్‌వాష్‌లు కూడా కరోనా వైరస్‌తో పోరాడగలవని తేల్చారు.

మౌత్‌వాష్‌తో కరోనా ఖ‌తం.. పరిశోధకులు ఏమన్నారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts